ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం కనిగిరి మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కనిగిరిలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడుతూ బడి ఈడు పిల్లలను ప్రతి ఒక్కరిని బడిలో ఉండే విధంగా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించి బాలకర్మిక వ్యవస్థను నిర్ములిద్దామని అన్నారు. బాలలు చదువుకుంటేనే దేశ భవిష్యత్తు మంచిగా ఉంటుందని తెలిపారు.