నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ గ్రంథాలయాన్ని నిర్మించాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ గుత్తేదారులకు సూచించారు. కనిగిరిలోని ప్రభుత్వ బాలికొన్నత పాఠశాలలో పీఎం శ్రీ నిధులతో నిర్మిస్తున్న గ్రంథాలయ నిర్మాణ పనులను మున్సిపల్ చైర్మన్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయ భవన నిర్మాణ పనుల విషయంలో రాజీ పడకుండా నాణ్యతగా నిర్మించాలని ఆదేశించారు.