దేశవ్యాప్తంగా ఉద్యోగ, కార్మిక హక్కుల కోసం ఈనెల 20వ తేదీ జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో స్కీం వర్కర్లందరూ పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జివి కొండారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం హనుమంతునిపాడు లో ఆయన మాట్లాడుతూ కనీస వేతన చట్టం అమలు కోసం స్కీం వర్కర్లకు వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తున్న నిర్ణయాలను నిరసిస్తూ హక్కుల రక్షణ కోసం జరిగే సమ్మె పాల్గొనాలని కోరారు.