కనిగిరిలో 23వ తేదీన జరిగే వెలుగొండ జలాల సాధన సదస్సు కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండారెడ్డి తెలిపారు. కనిగిరిలోని సుందరయ్య భవన్ లో శనివారం సిపిఎం నాయకులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర నాయకులు బీవి రాఘవులు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు కేశవరావు, కొండలు పాల్గొన్నారు.