కనిగిరి పట్టణంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లుగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. పట్టణంలోని 9వ వార్డులో విద్యుత్ లో వోల్టేజ్ సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా నూతన ట్రాన్స్ఫార్మర్ కు శుక్రవారం విద్యుత్ శాఖ అధికారులతో కలిసి మున్సిపల్ చైర్మన్ స్థలాన్ని ఎంపిక చేశారు. విద్యుత్ లో వోల్టేజ్ సమస్యలు ఏర్పడకుండా నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా చైర్మన్ తెలిపారు.