కనిగిరి: విద్యార్థిని అభినందించిన ఎంఈఓ

76చూసినవారు
కనిగిరి: విద్యార్థిని అభినందించిన ఎంఈఓ
కనిగిరి పట్టణంలోని పాతూరు ఎస్సీ కాలనీకి చెందిన కేసనపల్లి గ్లోరీ అనే విద్యార్థిని ప్రతిష్టత నవోదయకు ఎంపికైంది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎంఈఓ నారాయణరెడ్డి బాలికను అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను విద్యార్థులు అందిపుచ్చుకొని విద్యాపరంగా అభివృద్ధి చెందాలని ఎంఈఓ అన్నారు. ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి, ఎస్ఎంసి చైర్మన్ గడ్డం ప్రియాంక, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్