చంద్రశేఖర పురం మండలం డీజీ పేట నేషనల్ హైవే167/బీ పక్కన నూతన ప్రైమరీ హెల్త్ సెంటర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి సోమవారం స్థల పరిశీలన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ డీజీపేట గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే తగిన స్థలాన్ని ఎంపిక చేస్తున్నామన్నారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.