హనుమంతునిపాడు మండలంలోని మంగంపల్లి మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి తిరుణాళ్ల ఉత్సవాల్లో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆదివారం రాత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగమ్మ తల్లి, గరటయ్య స్వామికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఎమ్మెల్యేకు ఆశీర్వచనాలను అందజేసి, తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. మండల టీడీపీ అధ్యక్షులు ఎస్ తిరుపతి రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.