పొట్టి శ్రీరాములు జన్మ స్థలం పెద్ద చెర్లోపల్లి మండలం పడమటిపల్లిలో ఆయన జన్మదినం సందర్భంగా కనిగిరి ఎమ్మెల్యే నరసింహారెడ్డి, ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ బుధవారం సందర్శించారు. పొట్టి శ్రీరాములు నివసించిన ఇంటిని పరిశీలించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన వీరుడు పొట్టి శ్రీరాములు జన్మస్థలాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఉగ్ర, రాకేష్ అన్నారు.