పామూరు పట్టణంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న రమేష్, మార్తమ్మ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. ప్రతిరోజు మార్తమ్మ పై అనుమానంతో రమేష్ ఘర్షణ పడేవాడు ఆదివారం కూడా ఘర్షణ పడిన అనంతరం మార్తమ్మ పడుకొని నిద్రపోతున్న సమయంలో రమేష్ రోకలిబండతో మార్తమ్మ తలపై మోది పరారయ్యాడు. స్థానికులు గమనించి వైద్యశాలకు తరలించగా మార్తమ్మ మృతిచెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.