కనిగిరి మండలంలోని ఎరువారిపల్లి, గోసులవీడు,పునుగోడు సచివాలయాలనూ మంగళవారం ఎంపీడీవో ప్రభాకర్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా సిబ్బంది విధులకు సకాలంలో హాజరుకావాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని విధులలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని గ్రామ సచివాలయ సిబ్బందిని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు గ్రామ సచివాలయం ద్వారా లబ్ధిదారులు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చన్నారు.