కనిగిరి: మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి

62చూసినవారు
కనిగిరి మున్సిపల్ పరిధిలోని జోసఫ్ స్కూల్ వద్ద నుండి కాసినయన ఆలయం వరకు రోడ్డుకు ఇరువైపులా పట్టణంలోని కొబ్బరి బోండాల వ్యాపారస్తులు ఖాళీ కొబ్బరి బోండాలు అన్నీ ఇక్కడికి తెచ్చి వేస్తున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఆ బోండాలలో వర్షాలకు నీళ్లు చేరి, కుళ్ళిపోయి దుర్వాసన వస్తోంది. దీంతో అక్కడ నివసించే ప్రజలు ఇబ్బందికి గురవుతున్నామని మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్