అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన కనిగిరి మున్సిపల్ చైర్మన్

82చూసినవారు
కనిగిరి పట్టణంలోని అన్నా క్యాంటీన్ ను మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మంగళవారం పరిశీలించారు. రూ. 5 చెల్లించి టోకెన్ తీసుకొని పేదలతో కలిసి భోజనం చేశారు. అన్నా క్యాంటీన్ లో అందిస్తున్న ఆహారం నాణ్యతతో ఉందని సంతృప్తి వ్యక్తం చేశారు. మరింత నాణ్యతతో పేదలకు ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం సబ్సిడీని భరిస్తూ పేదలకు అన్నా క్యాంటీన్ ద్వారా ఆహారం అందించడం అభినందనీయమన్నారు.

సంబంధిత పోస్ట్