కనిగిరి: ఆర్డీవోను కలిసిన మున్సిపల్ చైర్మన్

56చూసినవారు
కనిగిరి: ఆర్డీవోను కలిసిన మున్సిపల్ చైర్మన్
కనిగిరి ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డిని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మంగళవారం కలిశారు. 2 రోజుల క్రితం పట్టణంలో గాలివాన బీభత్సానికి శివారు కాలనీలలో పలుచోట్ల ఇళ్లు కూలి నష్టం జరిగిందని, శంఖవరంలో గోడకూలి ఓ మహిళ మృతి చెందిందని బాధితులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను కోరారు. స్పందించిన ఆర్డీవో ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లి బాధితులకు న్యాయం జరిగే విధంగా చూస్తామన్నారు.

సంబంధిత పోస్ట్