కనిగిరి బోయపాలెంలో ఆదివారం గాలివాన బీభత్సానికి చెట్లు కూలి, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో స్థానిక ప్రజల ఇబ్బందులను ఎదుర్కోన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ సోమవారం బోయపాలెంలో పర్యటించి పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగిస్తామన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేస్తామన్నారు.