కనిగిరి మండలం పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో సోమవారం కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బందికి పంటల యాజమాన్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎఫ్డిసిడిఏ రామ్మోహన్, కనిగిరి ఏడీఏ వెంకటరమణ మాట్లాడుతూ పంటల యాజమాన్యం పద్ధతులు, తెగుళ్ల నివారణ అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు పంట సాగు మెలకువలపై అవగాహన కల్పించాలన్నారు.