ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం లో శుక్రవారం జరిగిన రెండు వేరువేరు ప్రమాదాలలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వెలిగండ్ల మండలం గుడిపాటి పల్లిలో తాటిచెట్టు పై నుంచి పడి నాగభూషణం అనే వ్యక్తి మృతి చెందగా పీసీ పల్లి మండలం బండపాలెం వద్ద గేదెను ద్విచక్ర వాహనం ఢీకొని ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రధమ చికిత్స అనంతరం వీరిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలుకు తరలించారు.