కనిగిరి: వారికేమో గులాబీ పువ్వులు.. వీరికేమో హెచ్చరికలు

58చూసినవారు
కనిగిరి పట్టణంలోని చర్చి సెంటర్ లో సోమవారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. హెల్మెట్ ధారణపై కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ వాహనదారులకు అవగాహన కల్పిస్తూ మాట్లాడుతున్న సందర్భంలో హెల్మెట్ ధరించిన వాహనదారులు డిఎస్పి కంటపడ్డారు. వెంటనే స్పందించిన డిఎస్పి వారికి గులాబీ పువ్వులు ఇచ్చి అభినందించారు. హెల్మెట్ ధరించని వారికి ఈసారి హెల్మెట్ ధరించకుండా కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్