ఒంగోలుకు చెందిన చిరంజీవి అనే 87 ఏళ్ల టెన్నిస్ క్రీడాకారుడు కనిగిరిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి లాన్ టెన్నిస్ క్రీడల్లో పాల్గొని టెన్నిస్ ఆడాడు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ చిరంజీవి క్రీడాకారులతో కలిసి ఆదివారం ఘనంగా సత్కరించారు. మున్సిపల్ ఛైర్మన్ మాట్లాడుతూ 87 ఏళ్ల వయసులో కూడా కుర్రాళ్లతో పోటీపడి చిరంజీవి టెన్నిస్ ఆడటం ఆశ్చర్యపరిచిందని, క్రీడలకు వయసు అడ్డు రాదని నిరూపించారన్నారు.