తిరుపతిలో జరిగిన 16వ ఫైనాన్స్ కమిషన్ సమావేశంలో కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ గురువారం పాల్గొన్నారు. కనిగిరి మున్సిపాలిటీలో నీటి సమస్యల పరిష్కారం, వార్డుల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ కమిషన్‌కు వినతిపత్రం అందజేశారు. అభివృద్ధి కోసం తగిన మద్దతు ఇవ్వాలని కోరారు.