కనిగిరి పట్టణంలోని ఇందిరా కళాశాలలో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాల మందుబాబులకు అడ్డాగా మారటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పగలు కళాశాలలో తరగతులు కొనసాగుతుండగా, చీకటి పడిందంటే చాలు మందుబాబులు మద్యం బాటిల్స్ తో వాలిపోతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ కళాశాల ఆవరణలో మందుబాబుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు.