కనిగిరి: అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి

62చూసినవారు
కనిగిరి: అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
ప్రభుత్వం అప్పగించిన డ్రైనేజీ కాలువలు పనులను నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ వేగవంతంగా నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. శనివారం పట్టణంలోని 8వ వార్డు లోని అలీ మసీద్ లైన్ లో డ్రైనేజ్ కాలువలు నిర్మాణం చేపట్టే పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పరుస్తున్నట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్