మంత్రి నారా లోకేష్ సహకారం వల్లే రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు అవుతుందని కనిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. పెద్ద చెర్లోపల్లి మండలంలోని దివాకరపల్లి గ్రామంలో ఏప్రిల్ 2వ తేదీన రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ ను శంకుస్థాపన జరగనుందన్నారు. ఈ పనులను ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లోకేష్ కల్పిస్తున్నట్లు తెలిపారు.