ఫ్లోరైడ్ నుండి ప్రజలను కాపాడాలంటూ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జివి. కొండారెడ్డి తెలిపారు. కనిగిరి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో గురువారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశంలో ఫ్లోరైడ్ నుండి ప్రజలను కాపాడేందుకు సురక్షిత జలాలు అందించేందుకు ప్రభుత్వం బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. నిధులు కేటాయించకుండా జీవోలు ఇవ్వటం వలన ప్రయోజనం లేదన్నారు.