కనిగిరి: సీనియర్ వైసీపీ కార్యకర్త మృతి

62చూసినవారు
కనిగిరి: సీనియర్ వైసీపీ కార్యకర్త మృతి
కనిగిరి పట్టణంలోని నీలకంఠం వారి వీధికి చెందిన వైసీపీ కార్యకర్త షేక్ ఖాదర్ భాష అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్, వైస్ చైర్మన్ పులి శాంతి ఖాదర్ భాష భౌతికకాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా కల్పించారు. నాయకులు అరుణోదర్, నాయబ్ రసూల్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్