కనిగిరి పట్టణంలోని పలు లాడ్జిలను హనుమంతునిపాడు ఎస్సై కే. మాధవరావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాడ్జిలలోని రికార్డులను ఆయన పరిశీలించారు. గదులను తనిఖీ చేసి అక్కడ ఉంటున్న వ్యక్తుల ఐడీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ లాడ్జిలలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలన్నారు.