చంద్రశేఖరపురం మండలం మిట్టపాలెంలోని శ్రీ నారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామివారి మూలవిగ్రహాన్ని వివిధ పుష్పాలతో అలంకరించి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయంలో గోపూజ చేశారు. భక్తులు మహా నైవేద్యంతో గుడిచుట్టు ప్రదక్షిణలు చేసి స్వామివారికి సమర్పించారు. భక్తులను పండితులు ఆశీర్వదించి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.