కనిగిరి: డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు: ఎమ్మెల్యే

52చూసినవారు
కనిగిరి: డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు: ఎమ్మెల్యే
కనిగిరిలో నూతన డ్రైనేజీ కాలువల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని రెండవ వార్డ్ శివనగర్ కాలనీలో ఆయన పర్యటించారు. డ్రైనేజీ కాలువలు లేని చోట్ల వాటిని గుర్తించి, నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పట్టణంలోని 20 వార్డుల్లో డ్రైనేజీ కాలువలు లేనిచోట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్