ప్రభుత్వం భూములను ఆక్రమించుకున్న వారిపై ప్రభుత్వ పరమైన కఠిన చర్యలు తప్పవని కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. శనివారం ప్రజల ఫిర్యాదు మేరకు మున్సిపల్ చైర్మన్ పాత శంఖవరం, మూడో వార్డు నందు పారిశుద్ధ్య సిబ్బందితో పర్యటించి ఆ ప్రాంత ప్రజల క్షేత్రస్థాయి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఆక్రమణదారులను గుర్తించి వెంటనే ఆక్రమణలు తొలగించి నీటి నిల్వలు లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.