శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు తీసుకునే చర్యలకు అన్ని పార్టీల సహకారం అవసరమని వెలిగండ్ల ఎస్సై కృష్ణ పావని అన్నారు. సోమవారం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన కృష్ణ పావనిని మండల టీడీపీ అధ్యక్షులు ఎం వెంకటరెడ్డి, తెలుగు రైతు అధ్యక్షులు ఇంద్రభూపాల్ రెడ్డి, ఆ పార్టీ నాయకులు కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో అసాంఘిక కార్యకలాపాల నిరోధానికి చర్యలు తీసుకుంటామన్నారు.