జన విజ్ఞాన వేదిక సభ్యత్వ క్యాంపెయిన్ పోస్టర్ ను కనిగిరికి చెందిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ మర్రి ధనుంజయడు సాయి సిద్దార్థ హాస్పిటల్ నందు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు, డాక్టర్లు, మేధావులు జన విజ్ఞాన వేదికలో సభ్యులుగా చేరాలని అన్నారు. ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడం కోసం జెవివి గత 37 సంవత్సరాలుగా కృషి చేస్తుందన్నారు.