నిప్పు రవ్వ పడటంతో మంటలు వ్యాపించి గుడిసెలు బుగ్గిపాలయ్యాయి ఈ సంఘటన చంద్రశేఖరపురం మండలం కే. అగ్రహారం ఎస్టీ కాలనీలో గురువారం చోటు చేసుకున్నది. స్వరం పోలయ్య ఇంట్లో వంట చేస్తుండగా నిప్పు రవ్వలు పడటంతో ఒక్కసారిగా పెద్దగా మంటలు వ్యాపించి చుట్టుపక్కల గుడిసెలు పూర్తిగా తగలబడిపోయాయి. మంటలు వ్యాపించడాన్ని గమనించిన ప్రజలు గుడిసెలోని బయటికి పరుగులు తీశారు. లక్షల్లో ఆస్తి నష్టం సంభవించినట్లుగా పేర్కొన్నారు.