సిపిఐ పార్టీ శాఖల బలోపేతమే పార్టీ ముందున్న లక్ష్యమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్డి యాసిన్ అన్నారు. గురువారం కనిగిరి కొత్తపేట సిపిఐ పార్టి శాఖ మహాసభ సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుందన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి శాఖ సమావేశాలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.