హనుమంతునిపాడు మండలం ముప్పలపాడు గ్రామంలో బుధవారం ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పని ప్రదేశంలో ఆందోళన చేపట్టారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి కూలీల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలిపారు.