కనిగిరి: పొగాకు రైతుల ఆందోళన

68చూసినవారు
పొగాకు‌కు గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుతూ కనిగిరి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు గురువారం ఆందోళనకు దిగారు. నడిరోడ్డుపై రాస్తారోకో నిర్వహించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. దీంతో వాహనాలు నిలిచిపోయాయి. గిట్టుబాటు ధర లేదని ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. పోలీసులు వచ్చి నచ్చ చెప్పి ఆందోళన విరమింప చేశారు.

సంబంధిత పోస్ట్