కనిగిరి: బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా ఉమాకాంత్

61చూసినవారు
కనిగిరి: బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య  రాష్ట్ర కార్యదర్శిగా ఉమాకాంత్
రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా మారెళ్ళ ఉమాకాంత్, పురోహిత విభాగం రాష్ట్ర కార్యదర్శిగా తిమ్మరాజు వంశీకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏలూరులో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమాఖ్య ఎన్నికలు మంగళవారం జరగగా, కనిగిరికి చెందిన వీరిద్దరికీ కీలక పదవులు లభించాయి. ప్రభుత్వపరంగా బ్రాహ్మణులకు అందవలసిన అన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఉమాకాంత్, వంశీకృష్ణలు తెలిపారు.

సంబంధిత పోస్ట్