అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రభుత్వం తక్షణం భర్తీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బాబు డిమాండ్ చేశారు. కనిగిరి పట్టణంలోని ఎం యన్ ఎం డిగ్రీ కాలేజీలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు బుధవారం విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. మెగా డీఎస్సీ పై ప్రభుత్వం రోజుకో మాట చెబుతూ నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. హామీ మేరకు ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ఎండమావిగా కనిపిస్తుందన్నారు.