వెలుగొండ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కనిగిరిలోని చర్చి సెంటర్ లో సిపిఎం ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర నాయకులు కొండారెడ్డి మాట్లాడుతూ వెలుగొండకు బడ్జెట్ లో రూ. 1,600 కోట్లు నిధులు కేటాయించాలని కోరితే, రూ. 330 కోట్లు కేటాయించటం అన్యాయమన్నారు. నిర్వాసితులకే రూ. 1,000 కోట్లు ఇవ్వవలసి ఉంటుందని, పూర్తిచేసేందుకు రూ. 2,000 కోట్లు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.