ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వాడుకోవాలని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ తెలిపారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా కనిగిరిలో నీటి పొదుపు పై శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మున్సిపల్ చైర్మన్ గఫార్ మాట్లాడుతూ జల సంరక్షణలో భాగంగా ప్రతి ఇంటి పరిసరాలలో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. వాటి ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు.