పెద చెర్లోపల్లి మండలంలోని దివాకరపల్లి గ్రామంలో ఏప్రిల్ 2న రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంటుకు శంకుస్థాపన జరగనుంది. ఈ పనులను ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి లోకేశ్ సహకారం వల్లే రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటవుతుందన్నారు. ఎందుకు పనికిరాని భూముల్లో రైతులకు లబ్ధి చేకూరడమే కాక నిరుద్యోగ యువతకు ఉపాధి లభించనుందన్నారు.