పామూరు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో బంగారు బాల్యం కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, ఐసీడీఎస్, వెలుగు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. బాల్య వివాహాల నిరోధంపై చేపట్టాల్సిన చర్యలను సమావేశంలో చర్చించారు. బాలల హక్కుల పరిరక్షణ కోసం సమష్టిగా కృషి చేయాలని సమావేశంలో నిర్ణయించారు.