వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, తాగునీరు సాధన కోసం ఐక్య పోరాటం నిర్వహిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు హనీఫ్ తెలిపారు. హనుమంతునిపాడులో సిపిఎం నాయకులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన వెలుగొండ ప్రాజెక్టు సాధనకై రౌండ్ టేబుల్ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. సిపిఎం పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలో ప్రాజెక్టు కింద 39,400 ఎకరాల పారుదల ఉందని దాని కొరకు ఉద్యమిస్తామన్నారు.