కనిగిరి: వైసీపీతోనే బలహీన వర్గాలకు సంక్షేమం

వైసిపితోనే పేద, బడుగు బలహీనవర్గాలకు సంక్షేమ ఫలాలు అందుతాయని, వైయస్ జగన్ నిరూపించారని వైసిపి కనిగిరి నియోజకవర్గం ఇన్ ఛార్జ్ నారాయణ యాదవ్ తెలిపారు. కనిగిరిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ జెండాను వారు ఆవిష్కరించారు. అనంతరం వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నారాయణ యాదవ్ ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గఫార్, వైసిపి నాయకులు పాల్గొన్నారు.