దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు కార్యనిర్వహణ అధికారిగా మిట్టపాలెం నారాయణస్వామి ఆలయ ఈవో నరసింహ బాబు ఇటీవల నియమితులయ్యారు. పామురులో శుక్రవారం అయన మీడియాతో మాట్లాడుతూ కనిగిరి గ్రూప్ దేవాలయాలకు కార్యనిర్వహణ అధికారిగా నియమించినందుకు ఎమ్మెల్యే ఉగ్రకు, దేవాదాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాల పరిరక్షణకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.