కనిగిరి: గోడకూలి మహిళా మృతి

50చూసినవారు
కనిగిరి: గోడకూలి మహిళా మృతి
గోడకూలి మహిళ మృతి చెందిన సంఘటన కనిగిరిలోని కనకపట్నం వద్ద ఆదివారం జరిగింది. ఎస్సై శ్రీరామ్ తెలిపిన వివరాల ప్రకారం శంఖవరం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ గడ్డి తెచ్చుకునేందుకు కనకపట్నం వద్ద ఉన్న శివాలయం వెళ్ళింది. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో నిర్మాణంలో ఉన్న ఇంటి వద్దకు వెళ్లి తల దాల్చుకునేందుకు ప్రయత్నించగా అక్కడ గోడ కూలి లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్ఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్