కనిగిరి మండలం అయ్యలూరి వారి పల్లె గ్రామంలో ప్రఖ్యాతిగాంచిన శ్రీ తిరుమలనాథ స్వామి దేవస్థానంలో మహారాజ రాజగోపుర నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. 99 అడుగుల ఎత్తులో మహారాజ రాజగోపురం నిర్మించేందుకు ఆలయ కమిటీ అభివృద్ధి పనులు చేపట్టారు. పునాది నిర్మాణం కోసం 28 మెట్రిక్ టన్నుల స్టీల్, 4, 000 బస్తాల సిమెంట్, 100 యూనిట్ల బ్లూ మెటల్, 120 యూనిట్ల ఇసుకను వినియోగిస్తున్నట్లుగా ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.