భారీగా రేషన్ బియ్యం స్వాధీనం

62చూసినవారు
పామూరు పట్టణం లోని ఓ ప్రైవేట్ గోడౌన్లో నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టుకొన్న సంఘటన ఆదివారం జరిగింది. రేషన్ షాపుల ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు బ్లాక్ మార్కెట్ కు తరలించి సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఓ వ్యక్తి నుంచి సుమారు 200పైగా బియ్యం టిక్కీలను పట్టుకొని గోడౌన్ కు తాళం వేసి స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్