కనిగిరి ఎంఎన్ఎం డిగ్రీ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 17న జాబ్ మేళా జరగనుంది. ఈ మేళాలో 15కు పైగా బహుళ జాతీయ కంపెనీలు పాల్గొంటాయి. ఈ విషయాన్ని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ శుక్రవారం ఉపగ్రహణలో తెలిపారు. ఈ అవకాశాన్ని 18 నుంచి 30 ఏళ్లలోపు వయస్సు గలవారు వినియోగించుకోవాలన్నారు.