పిసీపల్లి మండలం వాటర్ షెడ్ ప్రారంభోత్సవం కార్యక్రమానికి బుధవారం కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి ప్రకాశం జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎమ్మెల్యే మొక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. మొక్కలు పెంచడం వలన ఆక్సిజన్ సమృద్ధిగా అందుతుందన్నారు.