ఒంగోలులో సోమవారం నిర్వహించిన ప్రతిభ అవార్డు కార్యక్రమంలో వివిధ కళాశాలల విద్యార్థులను సన్మానించారు. కనిగిరి విజేత కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్థిని షేక్ నజ్మా ప్రతిభను గుర్తించి కలెక్టర్ తమ్మిమ్ అన్సారీయా చేతుల మీదుగా అవార్డు అందించారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం ఆమెను అభినందించి భవిష్యత్తు విజయాలకు శుభాకాంక్షలు తెలిపింది.